నవతెలంగాణ – మల్హర్ రావు: విద్యార్థి దశ నుంచే గ్రామపంచాయతీ పాలనపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పంచాయతీ పాలన, విధులు, విధానాలు, బాధ్యతలను వివరిస్తూ పాఠ్యాంశంగా పొందుపర్చింది.ఆరో తరగతి సాంఘికశాస్త్రం పార్ట్-2 పాఠ్యపుస్తకంలో 13వ పాఠ్యాంశంగా ‘గ్రామ పంచాయతీలు’ శీర్షికతో ఏడు పేజీల్లో ఈ పాఠాన్ని ముద్రించారు. గ్రామస్తులకు సౌకర్యాల కల్పన, గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం, గ్రామ సభ, ఓటర్ల జాబితా, వార్డులు, రిజర్వేషన్లు, ఎన్నికలు, నిధులు, మండల పరిషత్, జిల్లా పరిషత్ తదితర వివరాలను ఇందులోపొందుపర్చారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యాన సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ పాఠాన్ని చదివితే గ్రామపం చాయతీలపై పూర్తి అవగాహన కలుగుతుందని పలువురు చెబుతున్నారు.
ఆరో తరగతిలో పంచాయతీ.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



