Saturday, December 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయండొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి

డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి ప్రకటించింది. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలకు సంబంధించి వాషింగ్టన్‌ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి ట్రంప్‌ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో పేర్కొన్నారు. దీంతో బంగారు పతకాన్ని ట్రంప్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని గియాని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్‌ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -