Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుమతి లేని మినరల్ వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి

అనుమతి లేని మినరల్ వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

సామాజిక ఉద్యమకారుడు వి రాజశేఖర్ శర్మ
నవతెలంగాణ – తిమ్మాజిపేట

నాగర్ కర్నూల్ పట్టణంలోని అనుమతి లేని, నాణ్యత ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ ప్లాంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుడు వి రాజశేఖర్ శర్మ డిమాండ్ చేశారు. జిల్లా మొత్తంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, వీటిలో చాలా వరకు ప్రభుత్వ అనుమతులు లేకుండా కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నాయి. నాచు పట్టిన ట్యాంకులలో నీటి నిల్వ తుప్పు పట్టిన యంత్రాలు ఏళ్ల తరబడి వాడుతున్న ప్లాస్టిక్ క్యాన్‌లతో ప్రజలకు స్వచ్ఛమైన నీరు పేరుతో కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని పట్టణానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వి.రాజశేఖర్ శర్మ అన్నారు.

మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఐఎస్ఐ మార్క్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తప్పనిసరని అయితే చాలా వరకు ప్లాంట్లు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని గతంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని అన్నారు. దీనివల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, నాణ్యత లేని నీటితో అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వాపోయారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, పట్టణ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి అనుమతులు లేని నిబంధనలు పాటించని అన్ని మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసి వాటిపై కఠిన చర్యలు తీసుకుని మూసివేయాలని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -