నవతెలంగాణ-హైదరాబాద్: లాడ్జిలో తల్లీ కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం విశాఖ జిల్లాలో జరిగింది. సింహాచలం సిరి చందన అనే లాడ్జిలో తల్లి కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు గాజువాక ప్రాంతానికి చెందిన తల్లి కుడిపూడి నీలవతి (60), కొడుకు గాయప్పాంజాన్ (40) గా గుర్తించారు. మృతుడు గాయప్పాంజాన్ టిసిఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి 2021 లో వివాహం అయ్యింది. అతని మీద హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో 498 ఏ కేసు ఉందని పోలీసులు తెలిపారు. తల్లీకొడుకు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ కు పోలీసులు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లాడ్జిలో తల్లీ కొడుకు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -



