Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమార్కులకు అధికారుల వత్తాసు..!

అక్రమార్కులకు అధికారుల వత్తాసు..!

- Advertisement -

-రోడ్లను అక్రమించి అక్రమ నిర్మాణాలు
-విచ్చలవిడిగా రోడ్లపై వాహనాల నిలిపివేతలు..
-హెచ్చరికలకే పరిమితమైన అధికారులు
-కానరాని చట్టపరమైన చర్యలు..
నవతెలంగాణ-బెజ్జంకి

మండల కేంద్రంలో రోడ్లను అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. అక్రమాలపై అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు నిలుపుతుండడంతో రోడ్లు ఇరుకుగా మారి ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు రోడ్లను అక్రమించి తమ వ్యాపార సామాగ్రిని నిల్వచేయడంతో ఇటీవల పోలీస్ శాఖ అధికారులు వ్యాపార సామాగ్రిని తొలగించారు.

రోడ్లపై వ్యాపారం నిర్వహించినా రోడ్లపై వాహనాలు నిలిపిన రూ.15 వేలు జరిమాన విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ యధావిధిగా రోడ్లపై విచ్చలవిడిగా వాహనాలు నిలుపుతుండడంతో అధికారుల చట్టపరమైన చర్యలు కానరావడం లేదని..అధికారుల తీరు మున్నాళ్ల ముచ్చటగా మారి హెచ్చరికలకే పరిమితమైందనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పక్షపాత వైఖరి అవలంబించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి రోడ్లను అక్రమించి చేపట్టిన నిర్మాణాలపై..రోడ్లపై నిలుపుతున్న వాహనాలపై చర్యలు చేపట్టాలని పలువురు స్థానికులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -