Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి 

టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి 

- Advertisement -

– ప్రతి ఒక్కరికి ఓటు హక్కును ప్రసాదించిన గొప్పవ్యక్తి 
నవతెలంగాణ –  కామారెడ్డి

ప్రతి ఒక్కరికి ప్రతి పనిలో భాగస్వామ్యం ఉండాలని ఉద్దేశంతో గత రోజుల్లో కొందరికే పరిమితమైన ఓటు హక్కును అందరికీ పరిమితం చేసిన మహోన్నత వ్యక్తి  భారత రత్న డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అని టి డబ్ల్యూ జేఎఫ్ నాయకులు అన్నారు. శనివారం ఆయన వర్ధంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందుగల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత  సంఘ సంస్కర్త అని, రాజ్యాంగ నిర్మాత గా,  భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా ఆయన ప్రసిద్ధి చెందారు.

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారన్నారు. సంఘంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కలనే నినాదంతో అంటరానితనం, కుల నిర్మూలన కోసం విశేష కృషి చేశాడన్నారు. అణగారిన వర్గాల న్యాయం, సమానత్వం, గౌరవం కోసం పోరాడారనీ, మహిళల సాధికారతకు, కార్మికుల హక్కుల కోసం  కృషి చేశారన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి వంటి అనేక ఉన్నత డాక్టరేట్ పట్టాలను పొందారన్నారు. ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 14 ప్రభుత్వం అధికారికంగా అంబేద్కర్ జయంతి గా  సమానత్వ దినోత్సవంగా  జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు చర్లవంచ కృష్ణమాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాకూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -