- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కారులో మంటలు వ్యాపించి పోలీసు ఇన్‌స్పెక్టర్ సజీవ దహనం అయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్ (38) ధారవాదలో ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పక్కన ఉన్న వంతెనను కారు ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు వ్యాపించి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -



