- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గ్లోబల్ సమిట్.. తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించింది, మా విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. గ్లోబల్ సమిట్ వివరాలను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. ‘‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో 27 సెషన్లు ఉంటాయి. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను సమిట్‌కు ఆహ్వానించాం. ఎయిర్‌లైన్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. సమిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో వస్తారు. ముఖ్యఅతిథులకు సమస్య వస్తే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం. ఇలాంటి సమిట్ గతంలో ఎప్పుడూ జరగలేదు’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
- Advertisement -



