Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యాంగంతో సమాజానికి సమానత్వ హక్కులు..

రాజ్యాంగంతో సమాజానికి సమానత్వ హక్కులు..

- Advertisement -

కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో సమాజానికి సమానత్వ హక్కులు లభిస్తున్నాయని కాంగ్రెస్ మండలాధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం మద్నూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి మద్నూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉషా సంతోష్ మేస్త్రి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. సామాజిక సమానత్వం, పేదల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చూపిన దారిలో నడుద్దామని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తో పాటు మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షులు బండి గోపి, మాజీ ఎంపీటీసీ కార్యవార్ రాములు, యువ నాయకులు అమూల్, కల్లూరు అశోక్, బాలు కర్రే వార్, బండి హనుమాన్లు, సాహెబ్ రావు, దత్తు మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -