నవతెలంగాణ – ఆలేర్ రూరల్
సీపీఐ(ఎం), బీఆర్ఎస్ బలపరిచిన గ్యార రాజు విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం శనివారం రోజున పటేల్ గూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం.ఏ ఇక్బాల్ మాట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న గ్యార రాజును సర్పంచ్ గా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజల కోసం పాటుపడే అభ్యర్థి నీతి నిజాయితీతో గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా ప్రజలను కలిసినప్పుడు విద్యావంతుడు నిస్వార్థపరుడు నిరంతరం పేద ప్రజల పక్షాన నిలిచే గ్యార రాజును ప్రజలందరూ ఐక్యంగా నిలబడి సీపీఐ(ఎం), బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గ్యార రాజును సర్పంచ్ గా గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజుకు నిరాజనాలు పలుకుతున్నారని తెలిపారు.
గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా ఈ ప్రాంతంలో సాగునీటి తాగునీటి సమస్యను పరిష్కారం దిశగా ఆలోచనలు చేయాలని గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని వారు ఈ సందర్భంగా రాజు నుండి వాగ్దానాలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మొరిగాడి రమేష్, పీక్క గణేష్,శాఖ కార్యదర్శి నిడిగొండ వాలి,బిఆర్ఎస్ నాయకులు బండ జహంగీర్,గ్రామ బి ఆర్ ఎస్ శాఖ అధ్యక్షుడు ఎంటిక మధు,మామిడాల భాస్కర్,బండ రమేష్పిల్లిట్ల కుమార్,గ్యార భాస్కర్,పొన్న లక్ష్మయ్య, వస్పరి ఆంజనేయులు,కే. శ్రీనివాస్ రెడ్డి,బొమ్మ కంటి రంగమ్మ,వస్పరి సత్యలక్ష్మి,గ్యార సూర్యనారాయణ,గ్యార యాకూబ్ గ్యార లలిత,గ్యార వజ్రమ్మ,కాల్వ గౌతమి తదితరులు పాల్గొన్నారు.



