- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండల పరిధిలోని ఊకొండి గ్రామానికి చెందిన చందపాక లింగస్వామి కుమారుడు హర్షవర్ధన్ (10) అటో బోల్తా పడి శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామానికి చెందిన పోలగోని సైదులు హర్షవర్ధన్ పార్ధీవ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. ప్రమాదవశత్తు తో హర్షవర్ధన్ మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆ కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
- Advertisement -



