- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్:విశాఖ వేదికగా మూడో వన్డేలో ఇండియన్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. మొత్తం 50ఓవర్లగాను 270 పరుగులకే సఫారీ జట్టును కట్టడి చేశారు. తొలుత టాస్ గెలిచిన భారత్ బవుమాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. క్వింటన్ డికాక్ సెంచరీతో బ్యాటింగ్ అదరగొట్టాడు. 48 పరుగులతో సౌతాఫ్రికా జట్టు కెప్టన్ బవుమా రాణించాడు. ఇండియాన్ బౌలర్లు కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధకృష్ణ చెరో నాలుగు వికెట్లు తీసి సఫారీ జట్టును భారీగా దెబ్బతీశారు. ఆర్షీదీప్, జడేజా చెరో వికెట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. చివరి వన్డేలో భారత్ విజయం సాధిస్తే టైటిల్ కైవసం చేసుకోనుంది.
- Advertisement -



