Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శారాజిపేటకు ఉప సర్పంచ్ గా సేవలందించా

శారాజిపేటకు ఉప సర్పంచ్ గా సేవలందించా

- Advertisement -

సర్పంచ్ గా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపెడతా
కత్తెర గుర్తు కేటాయింపు : కంతి మహేందర్ సర్పంచ్ అభ్యర్థి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

గత ఐదు సంవత్సరాలు శారాజిపేట గ్రామంలో సిసి రోడ్లు మట్టి రోడ్లు కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి అనేక పనులు చేశా అన్నారు. ప్రజల ఆపతి సాపతి సమయాల్లో ముందున్నానని ప్రజలు నాకు అవకాశం ఇస్తే మరింత సేవ చేసుకుంటానని వేడుకున్నారు. తనకు అధికారులు కేటాయించిన సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి నాతోపాటు వార్డు మెంబర్లు అందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ మహేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక అబద్ధపు మాటలు చెప్పారని ఆడకూతురుల పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పారు.

రూ.4000 పెన్షన్ అన్నారు. మహిళలకు ఇంటింటికి రూ.2500 చొప్పున ఇస్తామన్నారు.రెండు సంవత్సరాల్లోనే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మూటకటుకున్నారు. ఈ ఎన్నికల్లో కంతిమహేందర్ ను సర్పంచ్ అభ్యర్థి గా, బి ఆర్ ఎస్ వార్డ్ మెంబర్లను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ప్రచార కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు మోరిగాడి శ్రీనివాస్,చిలుకు నిరోష, బండ శ్రీనివాస్,మొరిగాడి రమ్య, అయిలి అనసూయ,కళ్లెం తిరుమలేష్, కంతి మల్లయ్య, చిలుకు ప్రశాంత్, పుట్టల సునీత,శనిగరం రవీందర్, బి ఆర్ ఎస్ నాయకులు బండ మహేందర్,రచ్చ రామ్ నరసయ్య,మొరిగాడిఅశోక్ బెజ్జారం రవి,దూడల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -