Saturday, December 6, 2025
E-PAPER
Homeఖమ్మంప్రశస్తు యాప్ ను వినియోగించుకోవాలి

ప్రశస్తు యాప్ ను వినియోగించుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధులు సమగ్ర సమాచారం పొందు పరిచే ప్రశస్తు యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో విద్యార్ధులు వివరాలు నమోదు చేయాలని విద్యాశాఖ మండలాధికారి పొన్నగంటి ప్రసాద్ రావు తెలిపారు.  అశ్వారావుపేట బాలికోన్నత పాఠశాల లో శనివారం ప్రధానోపాధ్యాయుల తో ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల మేళా,పిల్లలను సిద్ధం చేసే విషయాలపై చర్చించారు.గ్రంథాలయ తరగతులు నిర్వహించాలని, గ్రీటింగ్ కార్నర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా సామర్ధ్యాలలో అగ్ర భాగాన ఉండేవిధంగా ఎప్పటికప్పుడు సిలబస్ ను కవర్ చేస్తూ నోట్ బుక్స్,వర్క్ బుక్స్ కంప్లీట్ చేస్తూ మధ్యాహ్న భోజన మెనూ ను రుచికరంగా పాటించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రత్యేక విద్యా పాఠశాల నాయకులు రామ్మోహన్,సిద్ధాంతపు ప్రభాకర్ ఆచార్యులు,ఎం.రామారావు, ఐఆర్పీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -