- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండల కేంద్రంలో ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ పార్టీ మండల నాయకులు సర్కిల్ నరేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చట్ల వినీల్, గాండ్ల స్వామి, కానిందే ఉద్దవ్, కళ్లెం విట్టల్, పడవల రాజు, దర్శన్కర్ కైలాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



