Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముమ్మర ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు

ముమ్మర ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
సర్పంచి ఎన్నికల్లో భాగంగా ఘనపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం శనివారం చేపట్టారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు ఘనపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆగారం పద్మమ్మ కు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఘనపూర్ మండలం ఇన్చార్జులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్, మాజీ కౌన్సిలర్ విభూతి నారాయణ ఎస్.కె పాషా సర్పంచ్ అభ్యర్థి ఆగారం పద్మమ్మ కుమారుడు ప్రకాష్, గణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.

గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆగారం పద్మమ్మను సర్పంచిగా గెలిపించుకుంటే ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, కొత్త పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పథకాలు అందజేస్తామన్నారు. గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు మురుగు కాలువలు, కరెంటు స్తంభాలు, వీధిలైట్లు వాటర్ ట్యాంకులు లాంటి సమస్యలు గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఘణపురం మండల నాయకులు మాజీ ఎంపీపీ వెంకటయ్య, గణపురం మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల జిల్లా అధ్యక్షులు రమేష్ రాజు, డాక్టర్ నరేందర్ గణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -