- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రోజురోజుకూ గ్రామాల్లో కుక్కల,కోతుల దాడులు పెరిగిపోతున్నాయి.మనుషులసై కాకుండా ముగాజీవాలపై సైతం దాడులు చేస్తున్న పరిస్థితి. శనివారం మండలంలోని మల్లారం కన్నెవెన సమ్మయ్య అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రెపిల్లలను పొదిలో వేసి,గొర్రెలను మేతకు తోలుకపోయాడు. పొదిపై కుక్కలు దాడిచేసి తొమ్మిది గొర్రెపిల్లను తీవ్రంగా గాయపర్చగా అందులో 6 పిల్లలు చనిపోగా,3 ప్రాణాపాయస్థిలో ఉన్నాయని కాపరి కన్నీరుమున్నీరైయ్యాడు. గ్రామాల్లో కుక్కల,కోతుల బెడద నుంచి రక్షించాలని,ఆర్థికంగా నష్టపోయిన బాధిత కాపరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



