Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి పంట కాలం పొడిగించరాదు..

పత్తి పంట కాలం పొడిగించరాదు..

- Advertisement -


పత్తి శాస్త్రవేత్త  వీరన్న…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్

గుడ్డి పత్తి గులాబీ పురుగుతో పత్తి పంటకు ప్రమాదం పొంచి ఉందని పత్తి పంటకాలాన్ని పొడిగించరాదని వరంగల్ విశ్వవిద్యాలయ పత్తి ప్రధాన  శాస్త్రవేత్త ఎస్ వీరన్న, ఏరువాక కేంద్రం జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత అన్నారు. వారు శనివారం నవతెలంగాణ తో మాట్లాడుతూ డిసెంబర్ నెల చివరికల్లా పత్తి తీయడం ను పూర్తి చేయాలని, పత్తి పంట సాగులో జనవరి వరకు పత్తి తీయడం పొడిగించరాదని కోరారు. పత్తి పంట కాలాన్ని జనవరి వరకు పొడిగిస్తే గుడ్డి పత్తి  విరివిరిగా వస్తుందని గులాబీ కొరకు సంతతి పెరిగి, వచ్చే సంవత్సరం వేసే పత్తి పంటలను మరింత అధికంగా నష్టం చేసే అవకాశం ఉందన్నారు.

పత్తి చేనును రోటవేటర్, ష్రద్ధర్ భూమిలో కలియదు ఉండాలని, కలియ దున్నడం ద్వారా నేల సారవంతంగా మారుతుందన్నారు. నేలలో కర్బన శాతం పెరుగుతుందన్నారు. పత్తి కట్టెను కాల్చ రాదని, గులాబీ రంగు పురుగు సోకిన పత్తిని నిల్వ చేయరాదని, పత్తి ఏరిన చేనులో గొర్రెలను, పశువులను మేపాలన్నారు. నీటి వసతి ఉన్నచోట ప్రతి అడుగులో రెండవ పంటగా మొక్కజొన్న, జొన్న, బొబ్బర, పెసర కూరగాయ లాంటి పంటలను వేసుకోవచ్చు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -