- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
క్వార్టర్లీ తనిఖీలో భాగంగా శనివారం ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిరంతరం పనిచేసేలా చూడాలని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



