- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 36,442 వార్డు స్థానాలకు 89,603 మంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 9 వరకు ఉంది. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.
- Advertisement -



