- Advertisement -
నవతెలంగాణ – విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మూడో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లలో కలిపి) 20,000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేశవ్ మహరాజ్ వేసిన 14 ఓవర్‌లో నాలుగో బంతికి రోహిత్ సింగిల్ తీసి ఈ ఘనత సాధించాడు. అంతకుముందు సచిన్ తెందూల్కర్ (34357), విరాట్ కోహ్లీ (27910), రాహుల్ ద్రావిడ్ (24208) ఈ ఫీట్ సాధించారు.
- Advertisement -



