ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యాదగిరి స్వామి
నవతెలంగాణ-పాలకుర్తి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చెరిపెల్లి యాదగిరి స్వామి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యాదగిరి స్వామి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని కొని ఆడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్ అవకాశం కల్పించిందని అన్నారు. ఉద్యోగాలతో పాటు చట్టసభల్లో అన్ని వర్గాల ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి దండు రామచందర్, గణపురం భాస్కర్, గాదపాక రవికుమార్, గాదపాక కరుణాకర్, గాదపాక సోమన్న, గాయాల నాగరాజు, చెర్పెల్లి అశోక్, చెరుపల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



