సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ మంత్రి సీతక్క ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ఇంటెన్స్, థ్రిల్లింగ్‌గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఓ యూనిక్ కథని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం:అభినయ కృష్ణ, నిర్మాతలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్, డీఓపీ: రమేష్ కుశేందర్ రెడ్డి, క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్, సంగీతం: గ్యాని, ఎడిటర్: వరప్రసాద్, ఆర్ట్: భూపతి యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘కామాఖ్య’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



