నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని 15 గ్రామ పంచాయతీల సర్పంచ్ లకుగాను 5 క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియను ఈనెల 2నుంచి 5తేదీ వరకు రిటర్నింగ్ అధికారులు చేపట్టారు.15 సర్పంచ్ స్థానాలకు 115 నామినేషన్లు వేయగా 38 స్కృటిలో పోగా 77 మంది సర్పంచ్ అభ్యర్థులు మిగిలారు.128 వార్డులకు 339 మంది నామినేషన్లు వేయగా 17 స్కృటిలో పోగా 322 వార్డు సభ్యుల అభ్యర్థులు ఉన్నట్లుగా అధికారులు శనివారం తెలిపారు.కాగా దుబ్బపేటలో 4 వార్డులు ఉండగా నాలుగు వార్డుల్లో ఒక్కో వార్డుకు ఒక్కో వ్యక్తి మాత్రమే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.అలాగే చిన్నతూoడ్ల 2,3,4,6,7 వార్డుల్లో ఒక్కొక్కరు నామినేషన్ వేశారు. ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు.అయితే ఈనెల 7న అప్పీల్, 9వ తేదీ నామినేషన్లు వేసి బరిలో ఉండే అభ్యర్థులకు గుర్తులను ఖరారు చేస్తారు
నామినేషన్ పత్రాల పరిశీలన.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



