Sunday, December 7, 2025
E-PAPER
Homeఅంతరంగంసోషల్‌ మీడియా

సోషల్‌ మీడియా

- Advertisement -

ఇటీవల మనం ఎవరిని చూసినా ముబైల్‌లోనే లీనమైపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా దానికే అతుక్కుపోతున్నారు. అంతర్జాలంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్‌ మీడియాతో పాటు ఏవేవో వెబ్‌సైట్స్‌ వెదుకుతూనే ఉంటారు. అయితే అందులో మనకు ఉపయోగపడే సమాచారమే కాదు అవసర విషయాలు ముఖ్యంగా అవాస్తవమైనవే ఎక్కువగా మన కంట పడుతుంటాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తామా అంటే అదీ లేదు. ఇంకా వాటి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని తపిస్తుంటాము. ఆ వెబ్‌సైట్‌లు కూడా మనల్ని అలాగే ఊరిస్తుంటాయి.
ఇలాంటి విషయాల వెదుకులాట వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవలసి వుంటుంది. ముఖ్యంగా ప్రతికూల వార్తలు కంట పడినప్పుడు మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. అలాంటి సంఘటనలు మన జీవితంలోనూ జరుగుతాయేమోనన్న ఆలోచనలు మరింత కుంగదీస్తాయి. అప్పటికే మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇలాంటి ప్రతికూల వార్తల గురించి లోతుగా విశ్లేషించేందుకు టెన్షన్‌ పడతారు. దీనివల్ల ఉన్నట్టుండి చెమటలు పట్టడం, శ్వాస అందకపోవడం, గుండెదడ పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు.
ప్రత్యేకించి నిద్రపోయే ముందు ఇలాంటి సమాచారం కంటపడితే శరీరంలో ఒత్తిడి హార్మోన్‌ స్థాయిలు పెరిగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తల్లో కొన్ని అవాస్తవ సంఘటనలు కూడా ఉంటాయి. కొన్ని వెబ్‌సైట్లు కూడా నిజానిజాలు తెలుసుకోకుండానే వాటిని అలాగే పోస్ట్‌ చేస్తుంటారు. పదే పదే కంట పడే ఇలాంటి సమాచారం కూడా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి సందేహం ఉన్న వార్తల గురించి వెతికేటపుడు ప్రామాణిక వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వడం మంచిది.
సోషల్‌ మీడియా విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడడం మంచిదనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మన రోజువారీ లైఫ్‌స్టైల్‌లో ప్రతిదానికీ ఒక టైమర్‌ సెట్‌ చేసుకునే మనం మొబైల్‌, ఆన్‌లైన్‌ విషయంలో మాత్రం ఈ నియమం పెట్టుకోము. ఖాళీ దొరికినప్పుడల్లా మొబైల్‌తోనే కాలక్షేపం చేస్తుంటాం. కానీ ఈ విషయంలోనూ ఒక కచ్చితమైన టైమ్‌ టేబుల్‌ తప్పనిసరి. దాన్ని బట్టే ఓ అరగంటో, గంటో సోషల్‌మీడియా, ఇతర ప్రామాణిక వెబ్‌సైట్లకు సమయం కేటాయించడం మంచిది.
కొంత మంది రాత్రుళ్లు నిద్రపోకుండా మరీ ఫోన్‌ చూస్తుంటారు. ఈ అలవాటుకు స్వస్తి చెప్పాలంటే మొబైల్‌ను పడకగది బయటే వదిలి పెట్టాలి. కాలక్షేపం కోసం మొబైల్‌ను ఆశ్రయించే వారు అందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవడం మంచిది. భాగస్వామి, పిల్లలు, స్నేహితులతో సమయం గడపడం. అభిరుచులపై దృష్టి పెట్టడం, కాసేపు ప్రకృతితో మమేకమవడం, వ్యాయామాలకు సమయం కేటాయించండి. అనవసరమైన సమాచారం కోసం వెతుకులాడకుండా కెరీర్‌కు ఉపయోగపడే సమాచారం, మానసిక ప్రశాంతతను అందించే సరదా విషయాలు, స్ఫూర్తిదాయక కథలు వంటివి చదివితే చాలా మంచిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -