శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈషా’. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ఈనెల 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శనివారం సమర్పకుడు దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ,’ఈ సినిమాని దర్శకుడు శ్రీనివాస్ మన్నె ప్రతీది తనే దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమాను బాగా తెరకెక్కించాడు.
నేను పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో రెండు, మూడు సార్లు చూశాను. చాలా బాగుంది. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకం కలిగింది. హర్రర్ థ్రిల్లర్ మూవీస్‌లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. ఈ సినిమాలోనూ సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. అయితే సినిమా చివరకు వచ్చేసరికి ఒక పర్సనల్ ఫీల్ కలుగుతుంది. ఈ సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక రియలిస్టిక్ ఫీల్‌తో బయటకు వస్తారు. హర్రర్ థ్రిల్లర్ మూవీస్‌కు విజువల్స్, సౌండింగ్ క్వాలిటీ బాగుండాలి. ఈ సినిమాలో ఆ రెండూ బాగా కుదిరాయి. శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్ పాడిన రెండు పాటలు ఆకట్టుకుంటాయి’ అని అన్నారు.
ఆ రెండూ బాగా కుదిరాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



