Sunday, December 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమహారాజశ్రీ….

మహారాజశ్రీ….

- Advertisement -

ఓ నలభై ఏండ్ల కిందటి మాట. అప్పట్లో పత్రికల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల పేర్ల ముందు ‘శ్రీ’ అని తగిలించటం ఆనవాయితీ. శ్రీ ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. శ్రీ మంత్రి గారు మాట్లాడుతూ… ఇలా ఉండేవట అప్పట్లో వార్తలు. ఒకానొక పత్రికలోని సీనియర్‌ జర్నలిస్టులు దీనిపై లోతుగా ఆలోచించి, ముఖ్యమంత్రి, మంత్రి అనే పదంలోనే గౌరవ వచనాలు, సంబోధనలు ఉన్నప్పుడు ‘శ్రీ’లు, ‘గారు’లు ఎందుకని భావించి, వాటిని తీసేసి రాయటం మొదలు పెట్టారు. దీంతో కోపానికొచ్చిన ఆనాటి సీనియర్‌ మంత్రి వెంకయ్య (పేరు మార్చాం) నా పేరుకు మీరు ఎందుకు ‘శ్రీ’ తగిలించటం లేదంటూ సీరియస్‌ అయిపోయారు. ‘మీకు ‘శ్రీ’ తగిలించాలి అంతేగా…’ అని సదరు పత్రికవారు ఆయన పేరుకు ‘శ్రీ’ తలిగించారు.

తెల్లారి పత్రికలో ఈ విధంగా వచ్చింది…’మంత్రి వెంకయ్య శ్రీ ప్రారంభోపన్యాసం చేస్తూ…’. దాంతో విస్తుబోయిన మినిష్టర్‌…వాణిశ్రీ, రాజశ్రీలాగా నన్ను కూడా హీరోయిన్‌గా మార్చేశారా? అంటూ చిర్రుబుర్రులాడారట. అప్పటి నుంచి ఆయన ‘శ్రీ’, ‘గారు’ గురించి ఎప్పుడూ అడగలేదని చెబుతున్నారు నాటి సీనియర్‌ సంపాదకులు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకొచ్చిందంటే… ఈ మధ్యకాలంలో ప్రతీ మంత్రి, ప్రతీ ఉన్నతాధికారి విడుదల చేసే ప్రెస్‌ నోట్‌లో…’ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ముఖ్య మంత్రి గారి సూచనల మేరకు, సీఎం గారి దిశా నిర్దేశం నేపథ్యంలో…’ అనే వాక్యాలు పదేపదే దొర్లుతున్నాయి. పదిహేను లైన్లలో కనీసం ఆరేడు సార్లు ఈ విధంగా ముఖ్యమంత్రి నామస్మరణ మార్మోగిపోతోంది. అసలు వార్త కంటే ఈ పదాలే ఎక్కువైపోతున్నాయంటున్నారు పాత్రికేయులు. దీంతో చెప్పాలనకున్న విషయం పక్కకుపోతోందన్నది జర్నలిస్టుల ఆవేదన…

-బి.వి.యన్‌.పద్మరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -