Sunday, December 7, 2025
E-PAPER
Homeసోపతినదీ ప్రవాహం - జీవన పాఠం

నదీ ప్రవాహం – జీవన పాఠం

- Advertisement -

నది అనేది ప్రకతి సష్టిలో అత్యంత మంత్రముగ్ధం చేసే అద్భుతం. ఆ నది పుట్టుక ఒక చిన్న వాగు రూపంలో మొదలవుతుంది. కొండల గర్భం నుంచి జలమయమైన చినుకులు చేరి ఒక చిన్న జలధారగా మారుతాయి. మొదట ఆ జలధారకు దారి తెలియదు. రాళ్లను తాకుతూ, మట్టిని చీల్చుకుంటూ, చెట్ల వేరు పక్కన సేదతీరుతూ, ఆ జలధార నెమ్మదిగా ఒక దిశను సొంతం చేసుకుంటుంది. జీవితం కూడా అలాగే మొదలవుతుంది. మనిషి మొదట అడుగులు వేస్తున్నప్పుడు దిశ తెలియదు, దారి తెలియదు, కానీ ఒక్కో అనుభవం అతనికి మార్గం చూపుతుంది. నది పుట్టుకలో ఉన్న ఆ ఉత్సాహం, ఆ అల్లరి అది మన బాల్యంలో ఉన్న చంచలత లాంటిది.
కాలం కదులుతున్న కొద్దీ నది కూడా క్రమంగా పసితనాన్ని విడిచి ఒక స్థిరత్వాన్ని అందుకుంటుంది. అదే మన జీవితంలో యవ్వన దశ. ఆ దశలో నది వేగంగా ప్రవహిస్తుంది, ఏ అడ్డంకినైనా దాటిపోతుంది. మనిషి యౌవ్యనంలో కలలు, ఆలోచనలు, ధైర్యం అలా నదిలా ప్రవహిస్తాయి. ఎవ్వరూ అడ్డుకున్నా ఆగవు. కానీ ఈ వేగం ఎక్కడో ఒక చోట గమనాన్ని కోల్పోకుండా, లక్ష్యాన్ని మరచిపోకుండా కొనసాగితేనే నది సముద్రాన్ని చేరుతుంది. మనిషి కూడా అలా తన జీవిత గమ్యం దిశగా నడవాలి. అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆగిపోకూడదు. రాళ్లను చీల్చి, పల్లెలను దాటి, పొలాలకూ పంటకూ ప్రాణం నింపుతూ నది సాగినట్లు మనిషి కూడా సమాజానికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడేలా ఉండాలి.
నది ఎప్పుడూ వెనక్కి తిరగదు. అది ముందుకు మాత్రమే ప్రవహిస్తుంది. ఈ లక్షణం మన జీవితానికి గొప్ప పాఠం. గతంలో ఏమి జరిగిందన్నదానిపై బాధపడకుండా, భవిష్యత్తు వైపు నడవడం నేర్పుతుంది. నది గమ్యాన్ని ఎప్పుడూ మరచిపోదు, సముద్రమే ఆ చివరి నిలయం. మన జీవితంలో కూడా లక్ష్యం ఉంటేనే జీవితం సార్థకం. కష్టసుఖాలు, ఎగుళ్లు దిగుళ్లు అన్నీ నది ప్రయాణంలో భాగమే. మన జీవితంలో వచ్చే పరీక్షలు కూడా అలాగే సహజం. అవి మనను మెరుగుపరుస్తాయి, దఢత్వం నేర్పిస్తాయి.
నది ఏ చోట ప్రవహించినా ఆ నేలకి పచ్చదనం అందిస్తుంది. తన నీటితో పంటలు పూయిస్తుంది, జీవం పంచుతుంది. అదే నిజమైన జీవనార్థం. మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు, మన వల్ల ఎవరికైనా మేలు జరిగిందా అన్నది ముఖ్యం. నది ఎక్కడా తానొకటి కాదు, అందరికీ చెందింది. మనిషి కూడా స్వార్థం విడిచి, సాహచర్యం, సానుభూతి, పంచుకునే మనసుతో జీవిస్తే జీవితం నదిలా పావనమవుతుంది. మన ఆనందం మరొకరి కళ్లలో మెరుస్తేనే ఆ ఆనందం సార్థకం అవుతుంది.
కొన్నిసార్లు నది వరదగా మారి కడగండ్లను తెస్తుంది. కానీ అదే నది ఎండకాలంలో జీవనాధారం అవుతుంది. ఈ రెండు రూపాలు మన జీవితంలోని రెండు కోణాల్లా ఉంటాయి. కష్టసమయంలో మన మనసు తట్టుకోలేనంత తుఫాను లాగా మారుతుంది. కానీ ఆ తుఫాన్లు కూడా మనలోని లోతులను అర్థం చేసుకునే అవకాశమిస్తాయి. నది తీరాలు కొట్టుకుపోయినా, తిరిగి కొత్త తీరాలను సష్టిస్తుంది. మనం కూడా విఫలతలను భయపడకుండా, కొత్త ఆరంభాల కోసం మనలోని ధైర్యాన్ని తిరిగి వెలిగించాలి. విరిగిపోవడం జీవితానికి ముగింపు కాదు, కొత్త మార్గానికి ప్రారంభం మాత్రమే.
నది మార్గం ఎప్పుడూ సూటిగా ఉండదు. ఎడమ కుడి తిరుగులు, వంకరలు ఉంటాయి. జీవితం కూడా అలాగే. అన్ని సార్లు మన అనుకున్నదే జరగదు. కొన్నిసార్లు పరిస్థితులు మన దిశను మార్చేస్తాయి. కానీ దిశ మారినా గమ్యం మాత్రం ఒకటే. నది చివరికి సముద్రాన్నే చేరుతుంది. మనిషి కూడా గమ్యాన్ని మరచిపోకుండా, మార్గం మారినా దానిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి మలుపు ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి వంకర మనలో కొత్త జ్ఞానం నింపుతుంది.
నది దాటే ప్రతి ప్రదేశంలో ఓ గుర్తు మిగిలిస్తుంది. అక్కడి ప్రజల జీవనానికి ఓ భాగమవుతుంది. మనం కూడా మన జీవితంలో తాకిన ప్రతి మనసులో ఓ స్మతి మిగిలించగలిగితే అదే అసలైన సఫలం. నది పేరు లేకపోయినా దాని నీటిలోని చల్లదనం శాశ్వతం. మనం పేరుకి పరిగెత్తకపోయినా మన కషి, మన మానవత్వం మనకు శాశ్వత గుర్తింపు ఇస్తాయి.
నదిని చూసి మనం ఓర్పు నేర్చుకోవాలి. వర్షాలు రాకపోయినా అది ఆగిపోదు, చెరువులు ఎండిపోయినా తడి కోల్పోదు. మనిషి కూడా పరిస్థితులు ఎలా ఉన్నా తన సత్తా కోల్పోకూడదు. నది ఎప్పుడు తన గమ్యం చేరుతుందో ఆలోచించదు, కేవలం ప్రవహిస్తుంది. అదే జీవన రహస్యం ు క్రమం తప్పకుండా ముందుకు సాగడం. మన ప్రయత్నాలు తక్షణ ఫలితాలు ఇవ్వకపోయినా, ఆ నిరంతరతే మనను విజయానికి తీసుకెళ్తుంది.
నది తన గమ్యానికి చేరినప్పుడు సముద్రంతో కలిసిపోతుంది. ఆ క్షణం నదికి అంతిమం కాదు, కొత్త ఆరంభం. ఎందుకంటే ఆ నీరు మేఘాలుగా మారి మళ్లీ నేలపై వర్షమై పడుతుంది. జీవన చక్రం అలా నిరంతరం తిరుగుతూ ఉంటుంది. మన జీవితమూ అలా నిరంతరమైన ప్రయాణం. మనం చేయగలిగినంత మంచిని, ప్రేమను, జ్ఞానాన్ని పంచుతూ సాగితే మన ఉనికి ఎప్పటికీ వధా కాదు.
నదీ ప్రవాహం మనకు చెబుతున్న ఒకే ఒక నిజం ు నిలకడ అనేది ప్రవాహంలోనే ఉంది. కదలికే జీవితం. ఎక్కడ ఆగిపోతామో అక్కడే ఆరంభం క్షీణిస్తుంది. అందుకే నది లాగా మనం కూడా నిరంతరంగా సాగే పయనం కావాలి. మన ఆలోచనలు, మన కషి, మన సజన, ఇవన్నీ మనలోని ప్రవాహాలు. వాటిని ఆపకుండా, మరల మరల పునరుత్తేజం చేసుకుంటూ ముందుకు సాగితేనే జీవితం పుష్టిగా, పావనంగా ఉంటుంది.
జీవితాన్ని నది లాగా చూడగలిగినవాడు ఎప్పుడూ పాడవడడు. ఎందుకంటే అతనికి తెలుసు ు ప్రవాహం ఆగదు, జీవితం ఆగదు. ఎడబాటు వచ్చినా, అవరోధాలు ఎదురైనా, చివరికి గమ్యాన్ని చేరేవరకు ప్రయాణం ఆగదు. నది మనకు నేర్పే ఈ నిశ్శబ్దమైన కానీ లోతైన పాఠం మనిషి జీవితానికి అద్భుత మార్గదర్శకం. ప్రవహిస్తూ ఉండటం, పంచుతూ ఉండటం, జీవిస్తూ ఉండటం, అదే నిజమైన జీవనార్థం.

చిటికెన కిరణ్‌ కుమార్‌, 9490841284

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -