ఏడో తరగతి. అతను మనసు మంచిదే కానీ, మాట తీరు మాత్రం చాలా అల్లరిగా ఉండేది. అతనికి కోపం వస్తే, లేదా ఏదైనా నచ్చకపోతే గట్టిగా అరుస్తాడు. మొండిగా మాట్లాడేవాడు. ఎదుటివారిని బాధపెట్టేలా మాట్లాడడానికి వెనుకాడేవాడు కాడు. తన తోబుట్టువులతో, స్నేహితులతో, చివరకు తన తల్లిదండ్రులతో కూడా అతని మాటలు పరుషంగా ఉండేవి.
”నువ్వు నాకు అక్కర్లేదు!” ”ఇది నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను!” ”నువ్వెప్పుడూ నన్ను అర్థం చేసుకోవు!” ఇలాంటి మాటలు మనోజ్ నుండి తరచుగా వినిపించేవి.
మనోజ్ తల్లిదండ్రులు చాలా సార్లు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ”మాటలు కత్తిలాంటివి, జాగ్రత్తగా వాడాలి” అని నాన్న ఎన్నిసార్లు చెప్పినా మనోజ్ వినేవాడు కాదు.
ఒక రోజు, మనోజ్ తల్లిదండ్రులు ఒక పురాతన వస్తువుల దుకాణానికి వెళ్ళారు. అక్కడి వస్తువులన్నీ పాతవే, కానీ ప్రతి దానికీ ఏదో ఒక అద్భుతమైన కథ ఉండేది. ఆ దుకాణంలో మూలగా, దుమ్ము పట్టి ఉన్న ఒక అద్దాన్ని వారు చూశారు. ఆ అద్దం అంచులలో నగిషీలు చెక్కి, చాలా పురాతనంగా, కొంచెం భయానకంగా కనిపించింది.
ఆ దుకాణం యజమాని ”ఈ అద్దం చాలా వింతైనది. దీని పేరు ‘ప్రతిబింబం’. ఇది మీ రూపాన్ని మాత్రమే కాదు, మీ మాటలను కూడా ప్రతిబింబిస్తుంది” అని చెప్పారు.
మనోజ్ మాట తీరును మార్చడానికి ఏదైనా అద్భుతం జరగాలని ఆశించిన తల్లిదండ్రులు ఆ అద్దాన్ని కొనుక్కున్నారు.
ఆ అద్దాన్ని ఇంటికి తెచ్చి మనోజ్ గదిలో పెట్టారు. మనోజ్ దాన్ని చూసి నవ్వాడు. ”అబ్బో! ఇంకో పాత వస్తువా! ఏం పనికొస్తుంది ఇంట్లోకి?” అని దాన్ని ఎగతాళి చేశాడు.
మరుసటి రోజు ఉదయం నుండి అసలు ఆట మొదలైంది. మనోజ్ ఆడుకోవడానికి పక్కనే ఉన్న పార్కుకు వెళ్ళాలని అనుకున్నాడు. కానీ బయట వాన పడుతోంది. ”ఈ వానెందుకు? నా ఆటకు అడ్డు తగులుతుంది! అసహ్యం!” అని కోపంగా అరుస్తూ అద్దం వైపు చూశాడు.
వెంటనే ఆ అద్దం తన రూపాన్ని ప్రతిబింబించింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అద్దంలో ఉన్న మనోజ్ బొమ్మ, అతనిలాగే గట్టిగా, అచ్చు తన గొంతుతోనే గట్టిగా అరిచింది: ”ఈ వానెందుకు? నా ఆటకు అడ్డు తగులుతుంది! అసహ్యం!”అని.
కానీ ఆ ప్రతిధ్వని మనోజ్ సాధారణ గొంతులా కాకుండా, చాలా గంభీరంగా, కర్ణకఠోరంగా, వికతంగా వినిపించింది. ఆ అరుపుకు మనోజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అద్దం వంక భయంగా చూశాడు. అద్దంలో ఉన్న మనోజ్ రూపం కోపంతో వణికిపోతున్నట్లు, ఎర్రబడిన కళ్లతో కనిపించింది.
ఆ రోజు సాయంత్రం, మనోజ్ చెల్లెలు, చిన్నారి శతి, మనోజ్ టేబుల్‌పై ఉన్న రంగు పెన్సిల్‌ను తీసుకుంది. మనోజ్ దాన్ని చూసి కోపంతో ఊగిపోయాడు.
”ఏరు శతీ! నా పెన్సిల్ నువ్వెందుకే తీసుకున్నావ్? నువ్వు దొంగవి! నాకు తిరిగి ఇచ్చేరు! నువ్వంటే నాకు ఇష్టం లేదు!” అని గట్టిగా అరిచాడు.
వెంటనే అద్దం మళ్ళీ ఆ మాటలను ప్రతిబింబించింది. ఈసారి అద్దంలోని రూపం నవ్వుతున్నట్లుగా, కానీ ఆ నవ్వులో విషం నిండినట్లుగా కనిపించింది. ఆ కోపపు మాటలు మళ్ళీ భయంకరమైన గొంతుతో, చాలా గట్టిగా, గది అంతా ప్రతిధ్వనించాయి. శతి భయపడి ఏడుస్తూ పరుగెత్తుకు వెళ్లింది.
మనోజ్ తన కోపపు మాటలు ఆ అద్దంలో నుంచి మళ్ళీ వినిపించే తీరు చూసి వణికిపోయాడు. ఆ మాటలు తనవే అయినా, మరొకరు అరిస్తే ఎంత కఠినంగా, బాధాకరంగా ఉంటాయో అతనికి అర్థమైంది. ముఖ్యంగా ”నువ్వంటే నాకు ఇష్టం లేదు!” అనే మాట అద్దం నుండి వినిపించినప్పుడు, ఆ నొప్పి మనోజ్ గుండెకే తగిలినట్లు అనిపించింది.
మరుసటి రోజు, మనోజ్ బడికి వెళ్ళాడు. ఇంటికి రాగానే, అద్దం గురించి మర్చిపోయి, అమ్మ చేసిన భోజనం నచ్చలేదని ”ఛీ! ఏంటి ఈ కూర? ఇది తినలేను!” అని మొహం చిట్లించాడు.
తక్షణం అద్దం పగిలిపోయేంత గట్టిగా, కఠినమైన గొంతుతో పలికింది: ”ఇది తినలేను!”
మనోజ్ గబగబా గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. అద్దం నుండి వచ్చే ప్రతిధ్వని తనను వెంటాడుతున్నట్లు అనిపించింది. మనోజ్‌కు మెల్లగా అర్థమైంది. తాను ఎంత కఠినంగా మాట్లాడితే, ఆ అద్దం అంత కోపంగా, భయంకరంగా మాట్లాడుతోంది. ఆ మాటల ప్రభావం ఎదుటివారిపై కాకుండా, తనపైనే పడుతోంది.
ఒక రోజు, మనోజ్ ఇంట్లోనే కూర్చుని, తన మనసులోని మాటలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎప్పుడూ అలవాటైన కఠినమైన మాటలు, అతని నోటి నుండి సులువుగా బయటకు వచ్చేవి.
మనోజ్ చివరి ప్రయత్నంగా అద్దం ముందు నిలబడ్డాడు. ఈసారి కోపంగా కాకుండా, చాలా నెమ్మదిగా, దుఃఖంగా ”ఈ ప్రపంచంలో నేను ఎవరినీ సంతోషంగా ఉంచలేకపోతున్నాను. నేను చెడ్డవాడిని. నేను విఫలమయ్యాను” అని తన మనసులో బాధను వ్యక్తపరిచాడు.
మనోజ్ ఆ మాటలు అనగానే, అద్దం నుంచి ఎటువంటి భయంకరమైన ప్రతిధ్వని రాలేదు. బదులుగా, ఆ అద్దంలోని మనోజ్ రూపం నెమ్మదిగా నవ్వడం ప్రారంభించింది. ఆ నవ్వు వెచ్చగా, ప్రేమగా ఉంది. సున్నితంగా వున్నా కానీ శక్తివంతమైన గొంతు అద్దంలో నుంచి వినిపించింది.
”లేదు, ప్రియమైన మనోజ్. నువ్వు విఫలం కాలేదు. నువ్వు నిజాయితీగా మాట్లాడుతున్నావు. నేను కేవలం నీ మాటల ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తాను.”
మనోజ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.
”నువ్వు కోపంతో, మొండితనంతో, అసూయతో మాట్లాడిన ప్రతిసారి, నేను ఆ కోపాన్ని, మొండితనాన్ని ప్రతిబింబించాను. అందుకే ఆ మాటలు భయంకరంగా వినిపించాయి” అని అద్దంలోని రూపం వివరించింది.
”కానీ నువ్వు ఇప్పుడే చెప్పిన మాటలు, ‘నేను విఫలమయ్యాను’ అని… ఆ మాటల్లో స్వీయ-కరుణ ఉంది, మార్పు కోరిక ఉంది, నిజాయితీ ఉంది. అందుకే, ఆ మాటలు నా నుంచి ప్రేమగా, స్నేహంగా బయటకు వస్తున్నాయి”
అద్దం ఇంకా, ”నేను నీ మాటలను కాదు, నీ మాటల వెనుక ఉన్న భావనను ప్రతిబింబిస్తాను. నీలోని ప్రేమను, దయను మాటల్లో పెడితే, నా నుండి దయతో కూడిన మాటలే వస్తాయి.”
మనోజ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు విన్న తర్వాత అతనికి ప్రపంచం మొత్తం కొత్తగా కనిపించింది. తన సమస్య మాటలు కాదని, ఆ మాటల వెనుక ఉన్న కోపం, అహంకారమని అర్థమైంది.
ఆ రోజు నుండి, మనోజ్ ప్రతిబింబం (అద్దం) ముందు నిలబడి, మంచి మాటలు మాట్లాడటం అభ్యాసం చేయడం మొదలుపెట్టాడు.
”శతీ! నీ బొమ్మ చాలా బాగుంది. నాకు సహాయం చేయగలవా?” అని అడిగాడు. అద్దం నుండి సున్నితమైన, మధురమైన గొంతుతో ”నాకు సహాయం చేయగలవా?” అని ప్రతిధ్వనించింది.
”అమ్మా, నాన్నా! నేను మీతో కఠినంగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. నాకు మీరంటే చాలా ఇష్టం” అని మనోజ్ మనస్పూర్తిగా చెప్పాడు. అద్దం నుంచి వచ్చిన ప్రతిధ్వని చాలా ప్రేమగా, ఊహించనంత తియ్యగా వినిపించింది.
మనోజ్ లోని మార్పును అతని కుటుంబ సభ్యులు వెంటనే గమనించారు. అతని గదిలో ఉన్న ఆ పాత అద్దం కేవలం ఒక వస్తువు కాదు, అది మనోజ్‌కు మాటల హదయాన్ని పరిచయం చేసిన గొప్ప గురువు. కొన్నాళ్ళ తర్వాత, మనోజ్ మాటలు చాలా తీయగా, ప్రేమగా మారాయి. తన మాటలతో ఎవ్వరినీ బాధపెట్టకుండా, అందరితో స్నేహంగా మెలుగుతున్నాడు. ఒక రోజు, ఆ పాత అద్దం తెచ్చిన దుకాణం యజమానిని కలవడానికి మనోజ్ కుటుంబం వెళ్ళింది.
”ఆ అద్దం అద్భుతం చేసింది” అని తల్లిదండ్రులు సంతోషంగా చెప్పారు.
యజమాని నవ్వి, ”అద్భుతం ఆ అద్దంలో లేదు. అద్భుతం మనోజ్ హదయంలోనే ఉంది. ఆ అద్దం కేవలం హదయంలోని భావాలను ప్రతిబింబించే సాధనం మాత్రమే” అని చెప్పాడు.
మనోజ్ తల వంచుకుని నవ్వాడు. తన మాటల వెనుక ప్రేమ ఉంటే, ఆ ప్రపంచం మొత్తం తనతో ప్రేమగానే మాట్లాడుతుందని అతను నేర్చుకున్నాడు. అద్దం ఇప్పుడు అతని గదిలో శాశ్వతంగా ఉండిపోయింది. కానీ దాన్ని చూసి మాట్లాడవలసిన అవసరం మనోజ్‌కు లేకుండా పోయింది, ఎందుకంటే అతని మాటల వెనుక ఉన్న భావన ఇప్పుడు ఎప్పుడూ స్వచ్ఛంగా, నిర్మలంగానే ఉండేది.
డా. చిట్యాల రవీందర్, 7798891795
మాటలు నేర్పే అద్దం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



