వద్ధ అంటే పెరిగిన/ పరిపక్వత అని అర్థం ఉన్నపదానికి, ఆప్యా అంటే చెందిన/ పొందిన అనే విశేషణం చేర్చితే ఏర్పడిన, సగౌరవ, సాంప్రదాయక, సంస్కత పదం వద్ధాప్యం!
జీవతవత్తం తల్లిగర్భంలో, పిండాంకురమనే బిందువుతో మొదలయ్యి, పుట్టుక, బాల్యం, కౌమార్యం, యవ్వనదశల్లో వత్తాకారంలో పయనం సాగించి, వద్ధాప్యమనే పరిణితి చెందిన దశద్వారా అంకుర బిందువుతో కలిసిపోతుంది. వత్తం పరిపూర్ణమౌతుంది. ఇది హఠాత్పరిణామం కాదు, క్రమేణా జరుగుతుంది.
అదే వద్ధాప్యం!!!
ఈదశలో ప్రతివ్యక్తి శారీరకంగా బాల్యదశకు దగ్గరగా వెళ్లడం జరుగుతుంది. శరీరంలో దఢత్వం తగ్గి సున్నితంగా తయారౌతుంది. అంతకుమునుపు అన్నిపనులు ఎవరి సహాయం లేకుండా ఎంతో సమర్థతతో చేసుకోగలిగినవారు, ఈ దశలో కొంత ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది వారిని మానసికంగా కంగదీస్తుంది.
వద్ధాప్యం ఎప్పుడు మొదలౌతుంది?
ప్రస్తుత శాస్త్రీయ సమాచారాన్నిబట్టి వద్ధదశ, సాంకేతికంగా అరవైఆరునుండి మొదలౌతుంది. కానీ ఇది ఒకపరిధిలో అంచనా వేయాలంటే పదిసంవత్సరాలు అటుఇటుగా పేర్కొనవచ్చు. ఈ దశని బాల్య (65-79 సం.), మధ్యస్థ (80-89 సం.), వద్ధ(90 సం) వద్ధాప్యం అనబడే మూడు స్థాయిలుగా విభజించడం జరుగుతుంది. ఇది కేవలం సాధారణ గణాంక ప్రయోజనాలకు మాత్రమే వర్తిస్తుంది.
కారణం- అరవైఏళ్ళు దాటిన తరువాత కలిగే శారీరక- మానసిక మార్పులు అందరిలో ఒకేవిధంగా ఉండవు. వ్యక్తిగత వైవిధ్యాలతో కూడుకొని ఉంటాయి.
శరీరం ఒక వాహనం వంటిదే!
చాలాకాలం పనిచేయటంతో ఎలాగైతే వాహన భాగాలు దెబ్బతిని పనిచేయడానికి మొరాయిస్తాయో, అదేవిధంగా పరిణితిచెందిన శరీరంలోని ప్రతి అవయవమూ మార్పులకు లోనౌతుంది. స్థాయి ఏదైనప్పటికీ, వ్యక్తిగతంగా ఎటువంటి జీవితం గడిపినప్పటికీ, ప్రతిమనిషి జీవితకాలం అనివార్య చివరిదశ వద్ధాప్యం.
వద్ధాప్యదశలోకి అడుగు పెడుతున్నామనడానికి తొలిసంకేతం మాంద్యము. అంతకుముందు పనులు చేసుకొన్నగతిలో చేసుకోలేకపోవడం, అలవాటుపడిన నడక/ పనితో అలసిపోవడం, ఆయాసపడటం, రక్తనాళాల్లో, గుండెలో వయసువల్ల జరిగిన అంతర్లీన మార్పులకు సంకేతం కదలడం, నడవడం, వంగడం వంటి పనులు కష్టతరమౌతాయి. ఎముకల్లో గట్టితనం తగ్గి చిన్నదెబ్బలకే విరగడం వంటివి సర్వసాధారణం!
కండరాలు బలాన్ని కోల్పోతుంటాయి. కీళ్ళ కదలికలు మందగిస్తాయి. వెన్నెముక వంగడం మొదలై ఎత్తు సంకోచించినట్టుగా అనిపించవచ్చు. కదలికలో, పట్టులో అస్థిరత ఏర్పడవచ్చు.
చర్మకాంతి తగ్గుతుంది. పొడిగా పలుచగామారి, కొవ్వుకోల్పోయి, క్రమేపీ ముడతలు పడవచ్చు.
జుట్టుతెల్లబడి, ఊడిపోవడం, పలచబడడం మొదలవచ్చు. పెరుగుదలతగ్గి/ ఆగిపోవచ్చు. మగవారిలో బట్టతలరావొచ్చు/ పెరగవచ్చు.
చూపు మందగించి కంటిలో శుక్లాలు ఏర్పడవచ్చు.ఆకలి, రుచి, వాసన గ్రహింపులో మార్పులు రావొచ్చు.
జ్ఞాపకశక్తి తగ్గవచ్చు.
పళ్ళు చిగుళ్ల పట్టుతగ్గి, మెల్లగా ఊడిపోవచ్చు. ఉచ్చారణలో ఇబ్బంది, గళంలో మార్పులు కలుగవచ్చు.
మూత్రనాళ సంబంధ సమస్యలు తీవ్రరూపం దాల్చి విసర్జనలో తొందర(ఇంకొటినెన్స్), పలుమార్లు చేయవలసి రావడం, చుక్కలుగా పడిపోవడం తరచుగా జరుగుతుంటుంది. మధుమేహ బాధితుల్లో, హద్రోగ పీడితుల్లో సమస్యలు మరింత తీవ్రతరం కావొచ్చు.
ఆ రెంటికీ అధికరక్తపోటు తోడైతే మెదడుకు సంబంధించిన స్ట్రోక్, తీవ్రమాంద్యం, మరపు, అల్జిమెర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు తప్పవు.
ఐబీఎస్/ అరుగుదల/ కాలేయసమస్యలు రోగనిరోధకశక్తి తగ్గి, అంటువ్యాధులకు/ కాన్సర్ వంటివాటికీ తొందరగా గురౌతారు. కోలుకోవడానికి కష్టపడతారు.
ఇది తప్పదా?
మానవజీవనకాలం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏడులక్షలకు పైగా వందేళ్లుదాటిన వయోవద్ధులున్నట్టు గణాంకాల అంచనా. పెరిగిన ఆరోగ్య ప్రణామాలు దష్ట్యా, క్రమశిక్షణతో మెలిగినకొందరు ఎనభయ్యో వయసులో కూడా ముప్ఫయి తలపించేటంత ఆరోగ్యంగా ఉన్నవ్యక్తులున్నారు.
పైనపేర్కొన్నవన్నీ వద్ధాప్య దశకుచేరిన వారందరిలో జరిగి తీరుతాయని నియమమేమీలేదు. ఎవరిలో, ఎప్పుడు, ఏవి, ఏవిధంగా ప్రకటితమౌతాయన్నది తెలుసుకోవడం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో వీలుకాదు కాబట్టి, వద్ధాప్య సంబంధిత సమస్యలపై అప్రమత్తత, నివారణచర్యలు, వ్యక్తిగతంగా దైనందిన జీవనశైలిలో చిన్న, చిన్న మార్పులు ఇముడ్చుకోవడం తప్పనిసరి.
మానసిక, ఆర్థిక, సాంఘికస్థైర్యం సమకూర్చుకోవాలి. ఒంటరిగా జీవించవల్సిన అవసరాన్ని గుర్తించాలి. మందులపై వైద్యులపై ఆధారపడడం తగ్గించుకోవాలి. ఆవిధమైన జీవనశైలి అలవర్చుకోవడానికి మున్ముందుగా వద్ధాప్య మార్పులపట్ల అవగాహన, ఆమోదం పెంచుకోవాలి.
రోజువారీ వ్యాయామం, బరువుపట్ల అప్రమత్తత, ఆహారనియమాలు, తాగవల్సిన నీరు, మంచినిద్ర, మానసిక ఆహ్లాదం కోసం మంచి అలవాట్లు, దురలవాట్లకు దూరంగా/ ఇంద్రియ నియంత్రణ కొరకు ప్రాణాయామం- యోగాసనాలు-ధ్యానకేంద్రీకరణ వంటి నిరంతర అభ్యాసాలు చేస్తుండాలి.
చర్మ ఆరోగ్యం కొరకు ప్రాకతిక పద్ధతుల్ని పాటించాలి. రోజు ప్రొద్దున్నే గోరువెచ్చని నీటితో చర్మానికి మేలుచేకూర్చే సబ్బు/ లోషన్ వాడటం వలన హానికారక క్రిములనుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు. స్నానం చేయకుండా డియోడరెంట్ స్ప్రే చేసుకోవడం చర్మానికి హానికారకం! అదేవిధంగా జుట్టు సంరక్షణ-రసాయనాలతో కూడిన స్ప్రేస్, జెల్స్, షాంపూస్, అనియంత్రిత స్ట్రైట్న్రెర్సా వాడకం, గాలికి వదిలేయడం వంటి చర్యలతో జుట్టు అనాటమీ దెబ్బతిని రాలిపోవడం, తెల్లబడి పోవడం, చిట్లిపోవడం వంటివి జరుగుతాయి.
పళ్ళు, చిగుళ్లు, నోటిఆరోగ్యం ముఖ్యం. రోజూ తప్పనిసరిగా మంచి బ్రష్‌తో కనీసం రెండు సార్లు పళ్ళు తోముకోవాలి. ఏది తిన్నా, వెంటనే నోరు పుక్కిలించాలి. పడుకోబోయే ముందు ఫ్లోస్సింగ్ ఏసుకోవాలి, నాలుక శుభ్రపరచుకోవాలి. దుర్వాసన, ఆహారం ఇరుక్కుని పోవడం వంటిసమస్యలు వున్నప్పుడు తప్పక వైద్యులను సంప్రతించాలి.
తీవ్రస్థాయి శబ్దాలనుండి చెవులను ఎంతోజాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇయర్‌ఫోన్ వాడకం నియంత్రితంగా చేయాలి. తలస్నానం చేసేటప్పుడు నీరుపోకుండా చూసుకోవాలి. వినికిడిలోతేడా/ చెవి నుండి నీరు చీమువంటి సమస్యతలెత్తినా వెంటనే చెవి నిపుణుల్ని సంప్రతించాలి.
మంచి పుస్తకపఠనం, సురక్షితపద్ధతుల్లో పనులు చేసుకోవడం, శరీరసహకారాన్ని బట్టి సమిష్టి కార్యక్రమాల్లో/ క్రీడల్లో పాల్గొనడం, శరీర పరిమితుల్ని బట్టి రోజువారీ దినచర్య ప్రణాళికను తయారు చేసుకోవడం, పోషకాహార నియమాలు పాటించడం, వ్యర్థ క్యాలరీలను విడనాడడం, అందరితో స్నేహపూర్వక సంభాషణలు జరపడం, వీలైనప్పుడల్లా అందరి శ్రేయోభిలాషి ి(గుడ్సమారిటన్) వంటి పలు చర్యలు చేపట్టడంతో మానసికరోగ్యమూ, సాంఘిక సంతులత రెండూ పుష్కలంగా పొందవచ్చు. మానసిక ప్రపంచంలో ప్రశాంతంగా శేషజీవితం గడిపేయవచ్చు.
డాక్టర్ మీరా,రిటైర్డ్ ప్రొఫెసర్ అఫ్ మైక్రోబయాలజీ,ఫీవర్ హాస్పిటల్ /ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్.



