Sunday, December 7, 2025
E-PAPER
Homeకవితసరిహద్దురేఖ

సరిహద్దురేఖ

- Advertisement -

ఇప్పుడు
ఆకాశం సూర్యచంద్రులూ
నక్షత్రాలనూ కోల్పోయి
కాలిపోయిన కల్లంలా
నిర్వికారంగా తోస్తుంది
నేలలో ఆయుధాలు
మొలుస్తున్నాయన్న నెపంమోపి
చాల్లల్లో నెత్తురుపారించారు
కోడిపిల్లల్ని
గద్దతన్నుకుపోబోతోందని
అరిచిన పాపానికి
గాలికిసంకెళ్ళువేసి ఊచలులెక్కబెట్టించారు
గుట్టల్ని పుట్టల్నీ
అసహజంగా చెరబట్టడం
చేతులుమార్చడం చూశాడన్నకోపంతో
కొండమీద అస్తమిస్తున్నసూర్యున్ని
నిందితునిగా నమోదుచేశారు
రాత్రికి రాత్రే
నదీపాయల్ని గొలుసులతో బంధించి
ఈడ్చుకెళ్ళుతున్నారని గొణిగినందుకు
అటుగావచ్చిన
చంద్రున్నీ నిర్భందించారు
ప్రకతిలో ప్రతి అణువూ
పంటిబిగువున
అణిచిపెట్టుకున్న విస్ఫోటనం
ఇప్పుడు
సరిహద్దుపొడవునా
పేగుతెగినవిషాదం…..

  • కొండి మల్లారెడ్డి, 9652199182
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -