- Advertisement -
సెల్‌కు చెవులు కళ్లు
అతుక్కు పోయాయి
చేతులు శరీరం
ఇక పరాధీనం
తరాలు అనవసరం
రేయింబవళ్లు అదే
ఏకపాత్రాభినయం
ఎరుకపోయాక
ఏం ధ్యాస? ధ్యానం?
మర్చిపోయా
ఇంగితం
ఇతర ఇంద్రియాలు
పూజ్యం
ఈ’హెల్’లో కూరుకుపోయా
ఎలా బయటపడాలి?
హలో! ఎవరైనా వున్నారా..?
హెల్ప్!
- కె.శాంతారావు, 9959745723
- Advertisement -



