Sunday, December 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీపీల్లో కొనసాగిన పాలకవర్గాల ఏకగ్రీవాలు

జీపీల్లో కొనసాగిన పాలకవర్గాల ఏకగ్రీవాలు

- Advertisement -

పలుచోట్ల ధ్రువీకరణ పత్రాలు అందజేసిన అధికారులు

నవతెలంగాణ- విలేకరులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకవర్గాల ఏకగ్రీవ ఎన్నికలు కొనసాగుతున్నాయి. శనివారం కూడా పాలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో అక్కడ ఎన్నికలు తప్పాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపే మండలం రామన్నగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజన సంక్షేమ పరిషత్‌ బలపరిచిన మడకం నాగేశ్వరరావు ఏకగ్రీవం అయ్యారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బిచ్చాల బిక్షం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం రూరల్‌ మండలంలో పల్లెగూడెం, దారేడు గ్రామపంచాయతీలల్లో సీపీఐ బలపరిచిన అభ్యర్థులను ఆయా గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పల్లెగూడెం అభ్యర్థిగా చండూరు సృజన, దారేడు అభ్యర్థిగా బత్తుల వెంకటేశ్వర్లు ఏకగ్రీవమయ్యారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలో 5 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొమ్ముబండతండా గ్రామంలో మాలోతు విజయలక్ష్మి (కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి), శీతలతండా గ్రామం- బాణోతు కృష్ణ(కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి), చెన్నారిగూడెం- మాతంగి నాగేశ్వరావు (కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి), రామచంద్రనగర్‌- పాయిలి నాగరాజు (కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి), మాధవగూడెం గ్రామం- డి.వీరబాబు (బీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి) సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి ఉప్పుల వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్‌గా జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

త్రిపురారం మండలం లోక్యతండాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నేనావత్‌ జ్యోతి, బడాయిగడ్డలో కాంగ్రెస్‌ అభ్యర్థి దానావత్‌ సైదానాయక్‌, అల్వాలపాడులో కాంగ్రెష అభ్యర్థి దానావత్‌ బుజ్జి, సత్యంపాడు తండాలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇస్లావత్‌ హనుమంతు నాయక్‌, వస్రం తండాలో కాంగ్రెస్‌ అభ్యర్థి ధనావత్‌ లలిత, కుంకుడు చెట్టుతండాలో కాంగ్రెస్‌ అభ్యర్థి పానుగోతు కిషన్‌నాయక్‌, రూప్లా తండాలో కాంగ్రెస్‌ అభ్యర్థి ధనావత్‌ రఘు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మర్రిగూడెంలో కాంగ్రెస్‌ అభ్యర్థిబిట్టు సింధు ఎన్నికయ్యారు.రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పరివేద, కొత్తపల్లి గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. పరివేద సర్పంచ్‌గా ఎన్కతల సురేందర్‌గౌడ్‌, కొత్తపల్లి సర్పంచ్‌గా అక్నాపూర్‌ బల్వంత్‌ రెడ్డికి అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కొత్తపల్లి గ్రామంలో మొత్తం 10 వార్డులు ఉండగా, రెండు వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలంలో మైతప్‌ఖాన్‌గూడ సర్పంచ్‌గా తెలుగు దుర్గయ్య, నాగిరెడ్డిపల్లి సర్పంచ్‌గా శేఖర్‌ ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -