సర్కారీ శాఖలకు జస్టిస్ సామ్‌కోషి విజ్ఞప్తి
మార్గదర్శకాలు ఇస్తాం: డీజీపీ శివధర్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జాతీయ న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 21న రాష్ట్రంలో లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటీవ్ చైర్మెన్, హైకోర్టు జస్టిస్ పి. సామ్‌కోషి తెలిపారు. రాజీకొచ్చే కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లో డీజీపీతోపాటు ఇతర శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కేసుల త్వరితగతిన పరిష్కారంపై చర్చించారు.ఈ సందర్భంగా జస్టిస్ సామ్ కోషి మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో ప్రభుత్వ శాఖల సహకారం అవసరమని చెప్పారు. పెండింగ్ క్రిమినల్ కేసులతోపాటు రాజీ పడే కేసులు, ఎక్సైజ్, ఆర్టీసీ, చెక్‌బౌన్స్ కేసులు సైతం లోక్‌అదాలత్‌తో పరిష్కరించవచ్చని అన్నారు.
లోక్‌అదాలత్ నిబంధనల ప్రకారం వీటి పరిష్కారానికి అన్నీ ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని సూచించారు. కేసులతో కోర్టులపై పనిభారం పెరిగిందన్నారు. ఎక్సైజ్ శాఖలో కేసుల పరిష్కారం వేగంగా జరగాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర డీజీపీ బి శివధర్‌రెడ్డి మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. ఈ మేరకు పోలీస్ శాఖకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్, అదనపు డీజీపీ చారు సిన్హా, హైదరాబాద్, రాజకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, ప్రాసిక్యూషన్ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోక్‌అదాలత్‌తో కేసుల పరిష్కారానికి సహకరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



