Sunday, December 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకెనడాలో భారీ భూకంపం..రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు

కెనడాలో భారీ భూకంపం..రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కెనడాలోని యూకాన్ ప్రాంతం, అమెరికాలోని అలాస్కా సరిహద్దు మధ్య రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంప కేంద్రానికి దగ్గరలో కెనడాలోని హైన్స్ జంక్షన్, అలాస్కాలోని యాకుటాట్ పట్టణాలు ఉన్నాయి. అధికారులు పెద్ద ఎత్తున నష్టం లేదా గాయాల గురించి ఎలాంటి సమాచారం రాలేదని, సునామీ హెచ్చరిక కూడా జారీ చేయలేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -