నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. గత ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో చిరుత దాడిలో చిన్నారులు మరణించడం ఇది మూడోసారి కావడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. వాల్పారైలోని అయ్యర్పాడి తేయాకు ఎస్టేట్‌లో పనిచేస్తున్న అస్సాం వలస కార్మికుడి కుమారుడైన సైఫుల్ (5) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సమీపంలోని తేయాకు పొదల నుంచి ఆకస్మాత్తుగా దూసుకొచ్చిన చిరుతపులి బాలుడిని పట్టుకుని తోటలోకి లాక్కెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తోట కార్మికులు, అటవీ శాఖ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటి తర్వాత తోట లోపలి భాగంలో సైఫుల్ మృతదేహాన్ని గుర్తించారు. చిరుత దాడి చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి.
చిరుత దాడిలో ఐదేళ్ల బాలుడి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



