Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంగోవా అగ్నిప్ర‌మాదం..పెరిగిన మృతుల సంఖ్య‌

గోవా అగ్నిప్ర‌మాదం..పెరిగిన మృతుల సంఖ్య‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గోవా రాష్ట్రం అర్పోరా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్-కమ్-నైట్ క్లబ్ అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరిగింది. మొత్తం 25మంది చ‌నిపోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సంఘ‌ట‌న స్థ‌లంలో స‌హ‌య‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

ఈ అంశంపై గోవా డీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం గురించి రాత్రి 12:04 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిందని చెప్పారు. “పోలీసులు, అగ్నిమాపక దళం, అంబులెన్స్‌లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. మృతదేహాలను వెలికితీశాం. క్లబ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని వంటగది ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 25 మంది చనిపోయినట్లు నిర్ధారించాం. అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం సిలిండర్ పేలుడు అని తెలుస్తుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.” అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -