Monday, December 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంస్పృహ తప్పిన డ్రైవర్.. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు

స్పృహ తప్పిన డ్రైవర్.. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కారులో వేగంగా వెళుతుండగా డ్రైవర్ స్పృహ కోల్పోవడంతో డివైడర్ ను ఢీ కొట్టి కారు గాల్లోకి లేచింది. ఎదురుగా వస్తున్న బస్సు, కార్ల పైనుంచి వెళ్లి ఓ పోల్ ను ఢీ కొట్టింది. సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ సంఘటన రొమేనియాలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  రొమేనియాలోని ఒరాడియా సిటీలో 55 ఏళ్ల వ్యక్తి తన మెర్సిడస్ కారులో వెళుతుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. మధుమేహంతో బాధపడుతుండడంతో సడెన్ గా స్పృహ కోల్పోయాడు. దీంతో కారు అదుపుతప్పి రాంగ్ రూట్ లోకి వెళ్లింది.

డివైడర్ ను ఢీ కొట్టి గాల్లోకి లేచింది. ఎదురుగా వస్తున్న ఓ బస్సు, దాని వెనకే ఉన్న రెండు కార్ల పైనుంచి వెళ్లి ఓ పోల్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ ను ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడికి చికిత్స అందిస్తున్న వైద్యులు.. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. డ్రైవర్ లైసెన్స్ ను 90 రోజులు రద్దు చేయడంతో పాటు సుమారు రూ.27 వేలు జరిమానా విధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -