– ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన
– కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బలరాం అనిత
నవతెలంగాణ – సదాశివపేట : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం భాగంగా ఆదివారం సదాశివపేట మండలంలోని ఇశ్రీతాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బలరాం అనిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపను సందర్శిస్తూ ప్రజలను కలిసిన ఆమె, ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా బలరాం అనిత మాట్లాడుతూ—ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున సంక్షేమ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇశ్రీతాబాద్ గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించే బాధ్యతను తనపై ఉంచాలని, గెలుపు సాధించిన పక్షంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి సహకారంతో గ్రామానికి అవసరమైన అన్ని అభివృద్ధి పనులను చేపడతానని ఆమె పేర్కొన్నారు.
ఇశ్రీతాబాద్‌లో ఇంటింటి ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



