Monday, December 8, 2025
E-PAPER
Homeజిల్లాలుగ్రామ అభివృద్ది కోసం అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించండి: బర్రె జహంగీర్

గ్రామ అభివృద్ది కోసం అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించండి: బర్రె జహంగీర్

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్

నందనం గ్రామంలో పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ మట్ట ఊర్మిళ అంజయ్య గౌడ్, వార్డ్ సభ్యుల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్, ఎన్నికల సమన్వయకర్త బర్రె జహంగీర్ కోరారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నందనం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మట్ట ఊర్మిళ అంజయ్య గౌడ్ కీ మద్దతుగా నిర్వహించిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో హాజరై మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. భువనగిరి ఎమ్మెల్యే

కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు గెలిచినప్పటి నుండి ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ పార్టీలకతీతంగా ఎటువంటి పక్షపాతం చూపకుండా సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేశారని చెప్పారు.

గత పదేండ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే భువనగిరి నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. నందనం గ్రామ పంచాయతీ భవిష్యత్ లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహాకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగి, ప్రజలకు అవసరమైన సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపురం చంద్రమౌళి గ్రామ శాఖ అధ్యక్షులు, కొండాపురం ప్రసాద్, కొండాపురం బాలరాజ్, మట్ట సైదులు, కళ్లెం నరేష్, పార్వతమ్మ, సింగిరెడ్డి పెంటా రెడ్డి, సైదులు సమన్వయకర్త పిట్టల బాలరాజ్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యువజన కాంగ్రెస్ నాయకులు ఎనగండ్ల సుధాకర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -