ఇస్మాయిల్ పల్లి సీపీఐ(ఎం) అభ్యర్థి పెంజర్ల సునీత సైదులు
నవతెలంగాణ కట్టంగూర్: ఇస్మాయిల్ పల్లి గ్రామ సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామానికి సేవకురాలిగా ప్రజలకు సేవలు అందిస్తానని సీపీఐ(ఎం) అభ్యర్థి పెంజర్ల సునీతసైదులు అన్నారు. ఆదివారం కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్నదని, ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాడైన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుందని అధికారం ఉన్న లేకున్నా పేదల ప్రక్షాన పోరాడుతుందని అన్నారు.
ప్రచార కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మాద సైదులు,జాల ఆంజనేయులు, పెంజర్ల కృష్ణ, యన్నమల్ల ప్రవీణ్ కుమార్, రామ్ రెడ్డి, సందీప్ రెడ్డి, చెరుకు అర్జున్, చిలుకూరి ప్రవీణ్, చిలుకూరి సైదులు, చెరుకు మల్లయ్య, మెడబోయిన శేఖర్, మేడబోయిన ముసలయ్య, మెడబోయిన నరసింహ,పెంజర్ల దేవేందర్ బొడ్డుపల్లి నాగమ్మ,పెంజర్ల రాములమ్మ, చిలుకూరి జ్యోతి ఉన్నారు.



