Monday, December 8, 2025
E-PAPER
Homeజిల్లాలుఉప్లూర్ నల్ల చెరువులో మొసలి కలకలం

ఉప్లూర్ నల్ల చెరువులో మొసలి కలకలం

- Advertisement -

నవతెలంగాణకమ్మర్ పల్లి

మండలంలోని ఉప్లూర్ నల్లచెరువులో ఆదివారం మొసలి కలకలం రేపింది. గత కొంతకాలంగా నల్లచెరువులో ముసలి ఉందన్న వదంతుల నేపథ్యంలో ఉదయం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు మొసలి కనిపించింది. దీంతో మత్స్యకారులతో పాటు, పశువులకు నీరు పెట్టేందుకు తీసుకు వెళ్ళే రైతులు, చెరువులు బట్టలుతికే రజకులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చెరువులో ఉన్న మొసలిని పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో పాటు మత్స్యకారులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -