నవతెలంగాణ-మల్హర్‌రావు: మండలంలోని కొండంపేట 8వ వార్డు సభ్యుల నామినేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్‌లపై అభ్యంతరాల స్వీకరణ ఉండగా 8వ వార్డు తరుపున నామినేషన్ వేసిన నేరెళ్ళ అశోక్ తన ప్రత్యర్థి ఎట్టవేన శరత్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారులకి శనివారం ఫిర్యాదు చేశాడు.ఈ సందర్భంగా ఫిర్యాదు దారుడు మాట్లాడారు. శరత్ అనే వ్యక్తికి మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీలో తన కుటుంబ సభ్యులతో పాటు ఓటర్ గా నమోదు అయ్యాడని, రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో కొండంపేటలో ఉన్న ఓటర్ లిస్ట్ పేరును ఆధారంగా చేసుకొని నామినేషన్ వేశాడని, ఇది చెల్లుబాటు కాదని రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఫిర్యాదు సేకరించిన అధికారులు విచారణ చేపట్టినట్లుగా తెలిసింది.
కొండంపేటలో 8వ వార్డు అభ్యర్థిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



