Monday, December 8, 2025
E-PAPER
Homeవరంగల్కాంగ్రెస్‌లో బిఆర్ఎస్ నాయకుల చేరిక‌

కాంగ్రెస్‌లో బిఆర్ఎస్ నాయకుల చేరిక‌

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని తొరూరు సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి అన్నారు. మండలంలోని తొర్రూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు గడ్డమీది నాగరాజు పదిమందితో కలిసి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చిలువేరు బాలరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఆలయ మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, ఐలమ్మ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డితో కలిసి మైసిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు.

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించి ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతుందని తెలిపారు. రెండు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలువేరు సంపత్, గోనే కార్తీక్ రెడ్డి, గోనె మహేందర్ రెడ్డి, పశువులాది అప్పయ్య, పశువులాది యాదగిరి, పులి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -