ఎంత శుభ్రం చేసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే.. కొంత మంది ముఖం జిడ్డుగానే ఉంటుంది. మాయిశ్చరైజర్‌తోపాటు మార్కెట్‌లో దొరికే అనేక రకాల క్రీములు వాడినా ఫలితం ఉండదు. ఇక జిడ్డు చర్మానికి తోడు మొటిమలు, మచ్చలు ఇబ్బందిపెడుతుంటాయి. అయితే జిడ్డు సమస్యతో ఇబ్బందిపడేవారు.. ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్రీన్ టీ: గ్రీన్ టీ కేవలం ఆరోగ్యానికే కాకుండా జిడ్డును తొలగించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. సీబమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయని.. తద్వారా జిడ్డు తగ్గుతుందని చెబుతున్నారు.
ఇవీ కూడా: గ్రీన్‌టీ మాత్రమే కాకుండా పాలు కూడా జిడ్డు తొలగిస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకోసం పాలను ముఖానికి అప్లై చేసుకొని పావుగంటయ్యాక కడిగేసుకోవాలని.. ఫలితంగా చర్మంపై జిడ్డుదనం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలానే జిడ్డుకు కారణమయ్యే సీబమ్ ఉత్పత్తి కూడా అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు.
వీటితోపాటు ముఖాన్ని శుభ్రపరుచుకునే నీళ్లలో నిమ్మరసం కలుపుకొన్నా.. నిమ్మరసంతో చేసిన ఐస్‌క్యూబ్‌తో ముఖాన్ని రుద్దుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
ఇవే కాకుండా కొబ్బరి పాలను ముఖానికి రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల జిడ్డుదనం తగ్గుతుందని చెబుతున్నారు. అందులో ఉండే రసాయనాలు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయన్నారు. కాబట్టి సాధారణ నీటితోనే రోజుకు రెండు లేదా మూడుసార్లు ఫేస్ క్లీన్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా కూడా జిడ్డుదనం అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.
జిడ్డు సమస్య వేధిస్తోందా?
- Advertisement -
- Advertisement -



