Tuesday, December 9, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆహార భద్రతను, విత్తన స్వావలంబనను దెబ్బతీసేలా విత్తన బిల్లు-2025

ఆహార భద్రతను, విత్తన స్వావలంబనను దెబ్బతీసేలా విత్తన బిల్లు-2025

- Advertisement -

ఆ చట్టంతో రాష్ట్రాల హక్కుల హరణ
నేడు రాష్ట్రవ్యాప్తంగా విత్తన ముసాయిదా బిల్లు ప్రతుల దహనం : ఎస్‌కేఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆహారభద్రతను, విత్తన స్వావలంబను దెబ్బతీసేలా విత్తన ముసాయిదా బిల్లు -2025 ఉందనీ, ఆ చట్టంతో రాష్ట్రాల హక్కులు హరించడబడుతాయని ఎస్‌కేఎం తెలంగాణ కన్వీనర్లు పశ్యపద్మ, టి.సాగర్‌, విస్సాకిరణ్‌, ప్రభాకర్‌, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, వి.మట్టయ్య, బి.రాము, విజరు పేర్కొన్నారు. ఆ ముసాయిదా బిల్లు కాపీలను గ్రామాల్లో దహనం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్‌ 12న వ్యవసాయ, రైతు సంక్షేమ కేంద్ర మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్‌ విత్తనాల బిల్లు-2025ను ప్రకటించిందనీ, డిసెంబర్‌ 11, 2025 వరకూ ప్రజా అభిప్రాయాలను ఆహ్వానించిందని తెలిపారు. ఈ బిల్లు 1966 విత్తనాల చట్టాన్ని రద్దు చేసి, కఠినమైన నాణ్యత నియంత్రణలు, ప్రధాన తప్పులకు మాత్రమే శిక్షలతో విత్తన నియంత్రణ వ్యవస్థను ఆధునికీకరించాలనుకుంటుందని పేర్కొన్నారు. భారత విత్తన రంగంపై బహుళజాతి సంస్థల ఆధిపత్యాన్ని పెంచేలా ప్రమాదకరంగా బిల్లు ఉందని ఎత్తిచూపారు. మార్కెట్లో చవకగా, నాణ్యమైన విత్తనాలు సమయానికి లభించే విధంగా హామీ లేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -