Tuesday, December 9, 2025
E-PAPER
Homeసినిమాఆ మహానటికి మరణం లేదు

ఆ మహానటికి మరణం లేదు

- Advertisement -

మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంగమం ఫౌండేషన్‌ చైర్మన్‌ సంజరుకిషోర్‌ నిర్వహణలో సావిత్రి జయంతి మహౌత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
సావిత్రి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’మహానటికి మరణం లేదు. నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారు. తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేది. సావిత్రి కనిపించేది కాదు’ అని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ,’సినీ రంగానికి సావిత్రి అభినయ నట శాస్త్ర గ్రంథం. సినీ రంగంలో ఎంతమంది కథానాయికలున్నా మహానటి మాత్రం సావిత్రి అని వేరే చెప్పక్కర్లేదు’ అని అన్నారు. నటులు, నిర్మాత మురళీమోహన్‌, తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, రోజారమణి, శివపార్వతి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్‌, స్వప్న దత్‌, రచయిత సంజరుకిషోర్‌, ప్రచురణ కర్త బొల్లినేని కష్ణయ్యలను ఘనంగా సత్కరించారు. సావిత్రి 90వ జయంతి సందర్భంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి పాటల పల్లవులను ఆలపించారు. అనంతరం సావిత్రిపై రూపొందించిన అవార్డు గ్రహీతల డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ఇటీవల నిర్వహించిన సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -