Monday, December 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయాసంగి సాగుకు నిజాంసాగర్‌ నీటి విడుదల

యాసంగి సాగుకు నిజాంసాగర్‌ నీటి విడుదల

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్‌
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా యాసంగి పంటల సాగు కోసం 1200 క్యూసెక్కుల నీటిని నేటి నుంచి 15 రోజుల పాటు అలీ సాగర్‌కు వదులుతున్నట్టు ప్రాజెక్ట్‌ ఏఈఈ సాకేత్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాలువ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి ఎవరు దిగొద్దని సూచించారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీల నీటికి గాను ప్రస్తుతానికి 17.802 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -