Tuesday, December 9, 2025
E-PAPER
Homeఆటలుఅవును.. పెండ్లి రద్దు

అవును.. పెండ్లి రద్దు

- Advertisement -

క్రికెటర్‌ స్మృతీ మంధాన ప్రకటన
ముంబయి : భారత మహిళల క్రికెట్‌ స్టార్‌ స్మృతీ మంధాన తన వివాహంపై ఎట్టకేలకు స్పందించింది. సంగీతకారుడు పలాశ్‌ ముచ్చల్‌తో నవంబర్‌ 23న స్మతీ మంధాన వివాహం జరగాల్సి ఉండగా.. మంధాన తండ్రి గుండెపోటుతో ఆసుపత్రి పాలైన కారణంగా పెండ్లిని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మంధాన, పలాశ్‌ పెండ్లి వాయిదాపై పలు కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్మృతీ మంధాన ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. తన వివాహం రద్దు అయిందని వెల్లడించింది. ‘కొన్ని రోజులుగా నా వ్యక్తిగత జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా వ్యక్తిగత జీవితం ఎంతో గోప్యం. ఇప్పుడూ అది అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా పెండ్లి రద్దు అయిన మాట వాస్తవమే. ఈ సమయంలో మా కుటుంబాల గోప్యతకు గౌరవం ఇవ్వాలి కోరుతున్నాను’ అని మంధాన తెలిపింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మంధాన.. ఈ నెల 21 నుంచి విశాఖలో ఆరంభం కానున్న శ్రీలంకతో టీ20 సిరీస్‌లో బరిలోకి దిగుతుంది. వచ్చే ఏడాది జనవరిలో ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు మంధాన సారథ్యం వహించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -