నవతెలంగాణ-హైదరాబాద్: ఇండిగో విమానాల రద్దుపై న్యాయ జోక్యం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. పరిస్థితులను గమనించి, దానిని పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుందని పేర్కొంది. లక్షలాది మంది వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారనే వాస్తవాన్ని తాము గమనించామని సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ ఇది చాలా తీవ్రమైన అంశం. లక్షలాది మంది విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం సకాలంలో చర్య తీసుకుని ఈ సమస్యను గుర్తించిందని మాకు తెలుసు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు మరియు ఇతర ముఖ్యమైన సమస్యలు ఉంటాయని తెలుసు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం పేర్కొంది.
గత కొన్ని రోజులుగా పలు ఇండిగో విమానాలు రద్దయ్యాయని, దీంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఒక న్యాయవాది కోర్టుకు తెలిపారు. విమానాల రద్దు గురించి ప్రయాణికులకు తెలియజేయబడదు అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 95 విమానాశ్రయాల్లో సుమారు 2,500 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ప్రయాణికులు ఇబ్బందులు ప డుతున్నారని అన్నారు.
ఇండిగో సంక్షోభం ఏడవ రోజుకి చేరుకుంది. సోమవారం ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల నుండి 250కి పైగా ఇండిగో విమానాలు రద్దయాయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే బెంగళూరు విమానాశ్రయం 117 సేవలను రద్దు చేసినట్లు తెలిపింది.



